Header Banner

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

  Thu Mar 06, 2025 18:20        Politics

దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన 'ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తన ప్రసంగంలో వెంకయ్యనాయుడు గురించి ప్రస్తావించారు. "1978లో నేను, వెంకయ్య నాయుడు ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలిచాం. అప్పటికీ ఇప్పటికీ ఆయన పవర్ తగ్గలేదు... పంచులు పెరుగుతున్నాయి. ఎప్పుడూ అచ్చతెలుగులో మాట్లాడుతుంటారు. చిన్న కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఎదిగి ఉపరాష్ట్రపతి అయ్యారు" అని వివరించారు. "గీతం యూనివర్సిటీని గత ప్రభుత్వ హయాంలో కూల్చాలని చూశారు. ఎంవీవీస్ మూర్తి ఒక చరిత్ర సృష్టించారు. గీతం యూనివర్సిటీని ఎందుకు నెలకొల్పాల్సి వచ్చిందని ఒకసారి అడిగాను. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో మా రెండో అబ్బాయికి సీటు ఇవ్వలేదు... అందుకే వారికంటే మంచి విద్యా వ్యవస్థను పెడతాను అని ఛాలెంజ్ చేసి గీతం యూనివర్సిటీని పెట్టానని ఆయన నాకు చెప్పారు"’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations